ఓ చిన్నారి అభిమాని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ని కౌగిలించున్న ఫోటో వైరల్ గా మారింది. ముంబై లోని జిమ్ వద్ద ఈ సంఘటన జరిగింది. జాన్వీకపూర్ జిమ్‌లో కసరత్తులు చేసి బయటకు వచ్చింది. అంతే జిమ్‌కు వచ్చిన ఓ చిన్నారి తన అభిమాన నటి జాన్వీకపూర్‌ను చూడగానే ఆమెను ఆమాంతం కౌగిలించుంది. దీంతో జాన్వీ కూడా చిన్నారి అభిమానిని అప్యాయంగా హత్తుకుంది. చిన్నారి అభిమానానికి జాన్వీ పరవశించిపోయింది. అనంతరం చిన్నారి కోరిక మేర ఆమె తల్లి, చిన్నారితో కలిసి జాన్వీకపూర్ సెల్ఫీ దిగింది.