ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రొమాంటిక్’ నుంచి ‘నా వల్ల కాదే’ సాంగ్ రీలీజ్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 05:55 PM



దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ‘నా వల్ల కాదే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. హీరో, హీరోయిన్ ను తలుచుకొని పాడుకునే ఈ ప్రేమ విరహ గీతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. భాస్కర్ భట్ల తన శైలి క్యాచీ పదాలతో రాసిన ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు సునీల్ కష్యప్ చక్కగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. గత చిత్రం ‘మెహబూబా’ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు ఆకాష పూరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com