చిరు సినిమాలు ఆపెస్తాడా...?

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 06:39 PM

చిరంజీవి, కొరటాల సినిమా తర్వాత మరో సినిమా ఆలోచన చెయ్యడం లేదని.. అందుకే కొత్త కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే న్యూస్ మెగా ఫాన్స్ కి ఒణుకు పుట్టిస్తుంది. చిరుతో త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు సినిమాలు చెయ్యాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం కొత్త కథలు వినడానికి సిద్ధంగా లేడని చెబుతున్నారు. ఈ వయసులో ఇంకా హీరోగా కొనసాగాలా.. లేదంటే ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్లు చేయాలా అనేది కొరటాల సినిమా తర్వాత ఆలోచిస్తారని అంటున్నారు. మరి కొరటాల శివ తో చేసే సినిమా ఆఖరిది అయినా అవ్వొచ్చు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
Recent Post