రేపటి నుంచి సరిలేరు నీకెవ్వరులో కొత్త సీన్స్...!

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:01 PM

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా అడుగులేస్తుంది ఈ చిత్రం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల మార్క్ అందుకుంది. 10 రోజుల్లోనే ఈ చిత్రం 120 కోట్ల మార్క్ అందుకుందని చిత్ర నిర్మాతలే అనౌన్స్ చేసారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రెండు వారాలు ముగిసిన తర్వాత ఈ చిత్రం దూకుడు కాస్త తగ్గిపోయింది. దాంతో ప్రమోషన్స్ బాగా గట్టిగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరో వారం రోజులైనా సినిమా థియేటర్స్‌లో ఉండాలన్నా.. అల వైకుంఠపురములో ధాటి తట్టుకోవాలన్నా కూడా కచ్చితంగా ఏదో ఓ మ్యాజిక్ చేయాల్సిందే. అందుకే ఈ చిత్రంలో మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేయబోతున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి మీడియాకు తెలిపాడు. మహేష్, రావు రమేష్ మధ్య వచ్చే ట్రైన్ ఎపిసోడ్‌లో వచ్చే ఓ కామెడీ సీన్ చాలా బాగుంటుందని.. షూట్ టైమ్‌లోనే అది తాము చాలా ఎంజాయ్ చేసామని తెలిపాడు అనిల్. నిడివి కారణంగా దాన్ని ముందు తీసేసినా ఇప్పుడు యాడ్ చేస్తున్నామని చెప్పాడు అనిల్ రావిపూడి. కచ్చితంగా ఈ సీన్‌తో పాటు మరో సీన్ కూడా కొత్తగా జత చేరుస్తున్నామని చెప్పారు .అయితే  రేపటి  సరిలేరు నీకెవ్వరు  నుంచి కొత్త సీన్స్ ఆడ్ చేయనున్నారు. మరి కొత్తగా యాడ్ చేయబోయే సన్నివేశాలు తో సరిలేరు కలెక్షన్స్ ని ఎలా పెరుగనున్నాయి చూడాలి?
Recent Post