ఆకట్టుకుంటున్న కంగన 'పంగా' మూవీ !

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:21 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 'పంగా' కథ అందరికి తెలిసిందే. కబడ్డీలో అదరగొట్టే జయ (కంగనా) అందరి మన్ననలు అందుకుంటూ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని బిడ్డని కన్నాక ఆ గుర్తింపు పోవడంతో పాటుగా కనీసం తన ఆట గురించి కానీ తన గురించి కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కలత చెందిన జయ మళ్ళీ కబడ్డీ ఆడి గెలవాలని పట్టుదలతో ఉండడంతో.. తన కుటుంబం కూడా జయకి సపోర్ట్ చెయ్యడంతో.. జయ మళ్ళీ తిరిగి కబడ్డీ ఆట మొదలుపెడుతుంది. మరి జయ ఆ వయసులో మళ్ళీ కబడ్డీలో సక్సెస్ సాధించిందా..? ఆ క్రమంలో జయ ఎదుర్కున్న సమస్యలేమిటి.. ? అనేది మిగతా కథ. మరి ఈ సినిమాని అందరు ఆడవాళ్ళూ చూసి ఇన్స్పైర్ అవ్వాలని.. సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది అని పంగా చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాట.
Recent Post