జబర్దస్త్ లో ఎమ్మెల్యే రోజా కిడ్నాప్...!

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:35 PM

అదేంటి.. రోజా కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా..? తన ఇమేజ్ ను కూడా పణంగా పెట్టేసి రోజా చేస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో. ఇందులో వచ్చే ఒక్కో స్కిట్ సంచలనంగా మారుతుంది. ఈ మధ్య వరసగా రోజా కూడా స్కిట్స్ చేస్తుంది. తన కాల్షీట్స్‌తో పాటు టైమ్‌ను కూడా అన్నిచోట్లా సమానంగా అడ్జస్ట్ చేస్తుంది ఈమె. సినిమాలు మాత్రమే చేయడం లేదు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచానికి మాత్రం దూరం కాలేదు రోజా. ఇప్పటికే టీవీ ప్రేక్షకులకు మాత్రం జబర్దస్త్ లాంటి కామెడీ షోతో పాటు బతుకు జట్కా బండి లాంటి సీరియస్ షోలతో చేరువైంది రోజా. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్‌లో పర్ఫార్మ్ చేసింది రోజా. అందులో రోజాను కిడ్నాప్ చేసాడు ఆది. ఇక రోజా కూడా సీరియస్ డైలాగ్‌ను కామెడీగా చెప్పేసింది. ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా అంటూ సీరియస్ అయింది రోజా. దాంతో ఆది వెంటనే మరో సెటైర్ వేస్తాడు. ఇది శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా స్పూఫ్. అందులో భాగంగానే రోజా కిడ్నాప్ డ్రామా కూడా ఉంటుంది. కుర్చీలో తాళ్లతో కట్టేసి హై డ్రామా చేసాడు ఆది. మొత్తానికి ఈ ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అయితే బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి రోజా ఇలాంటి స్కిట్స్ చేయడం అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలు వేరు.. ఎంటర్‌టైన్మెంట్ వేరు అంటూ కొందరు రోజాకు సపోర్ట్ చేస్తున్నారు.
Recent Post