ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 07:58 PM



అందాల నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఏంజెల్‌ వచ్చేసిందని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2012 లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. ఇటీవల సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్నేహ.. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com