కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు. వైజాగ్, హైదరాబాద్ లలో షూటింగ్ నిర్వహించారు. వచ్చే నెలలో గోవాలో రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
తారాగణం:కల్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి, 'జబర్దస్త్' మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్, మ్యూజిక్: తమన్ ఎస్ ,సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు ,ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ ,ఆర్ట్: బ్రహ్మ కడలి ,పీఆర్వో: వంశీ-శేఖర్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల ,నిర్మాతలు: రిజ్వాన్, ఖుషి ,దర్శకుడు: పులి వాసు.