'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' పూజాహెగ్డే ఫస్ట్ లుక్

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:38 PM

తాజా అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' నుంచి అఖిల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధార‌ణ ప్రేక్ష‌కుల వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌డం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్‌ని తెలియ‌జేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి మొద‌టి స్టెప్ అంటూ విడ‌దుల చేసిన అఖిల్ అక్కినేని లుక్‌కి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఇప్ప‌డు సెకండ్ స్టెప్ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేశారు . ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్‌లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్‌లు ఇటు మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండ‌టం ఈ సినిమాపై ప్రేక్ష‌కుల అంచ‌నా తెలియ‌జేస్తుంది.  ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు..
Recent Post