పవన్ మూవీ టైటిల్ అదేనా ?

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 14, 2020, 07:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో పింక్ సినిమా రీమేక్ మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్. ఇది పవన్ కళ్యాణ్ 27వ సినిమా. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఏడాది పాటు కూర్చుని క్రిష్ రాసుకున్న కథ ఇది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ పూర్తైన తర్వాత పూర్తి డేట్స్ క్రిష్ చిత్రానికి కేటాయించబోతున్నాడు పవర్ స్టార్. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.
Recent Post