ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సేతుపతి సరసన ఇద్దరు హీరోయిన్లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 10:10 AM



తెలుగు, తమిళంలో పిజ్జా సినిమాతో చిన్న నటుడిగా పరిచయం అయిన విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ నటుడిగా మారారు.  చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఎలాంటి పాత్రలకైనా సిద్దం అంటున్నారు.  హీరో, విలన్, కమెడా ఎలాంటి పాత్రలకైనా తాను సిద్దం అంటూ దూసుకు వెళ్తున్నారు.  తమిళ్ లోనే కాదు తెలుగు, మళియాళ భాషల్లో కూడా ఈ నటుడు తన సత్తా చాటుతున్నాడు.  ఆ మద్య తెలుగు ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో ఓ కీలక పాత్రలో నటించాడు విజయ్ సేతుపతి.  అయితే ఈ మూవీ సక్సెస్ కాకపోయినా.. విజయ్ సేతుపతికి బాగా పేరు వచ్చింది. తాజాగా నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. 


సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు.  నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అంతేకాదు.. నయనతార, సమంత కలిసి నటిస్తుండటం కూడా ఇదే ఫస్ట్ టైమ్.  ‘‘కాతు వాకుల రెండు కాదల్’’.  ఈ మూవీ తెలుగు లో కూాడా రిలీజ్ చేస్తారని అంటున్నారు.  అయితే స్టార్ హీరోయిన్ల సరసన నటించడం అనేది అంత సామాన్య విషయం కాదు. ఈ అదృష్టాన్ని విజయ్ సేతుపతి దక్కించుకున్నాడు.  మొత్తానికి విజయ్ సేతుపతి లక్కీ హీరో అని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.  ఈ మూవీ గనక సక్సెస్ అయితే మనోడికి తెలుగు, తమిళ నాట  మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు.  విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది.  ఇటీవల ఈ హీరో నటించిన సినిమాలు వరుసగా తెలుగులో కి కూడా డబ్ అవుతున్నాయి.  మొత్తానికి విజయ్ సేతుపతికి ఇద్దరు హీరోయిన్లతో భలే కలిసి వచ్చిందని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com