వరల్డ్ ఫేమస్ లవర్ లేటెస్ట్ కలెక్షన్స్ !

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 01:49 PM

దర్శకుడు క్రాంతి మాధవ్  విజయ్ దేవరకొండ హీరోగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రెండేళ్ల కింద గీత గోవిందం సినిమాతో తొలిరోజే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గతేడాది విడుదలైన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 12 కోట్ల షేర్ వసూలు చేసింది. డిజాస్టర్ అయిన నోటా కూడా తొలిరోజే 8 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. అంటే దాదాపు స్టార్ హీరో రేంజ్ అన్నమాట. కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం తొలిరోజు కేవలం 5 కోట్లతో సరిపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక దాంతోపాటు రెండో రోజు కూడా కలెక్షన్స్ మెరుగుపడలేదు. సెకండ్ డే ఈ సినిమా 2.4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్ 8 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ 20 కోట్లకు పైగానే జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత దూరం విజయ్ ఈ సినిమాను తీసుకెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Post