త్రివిక్రమ్ కు నోటీసులు పంపుతానన్న దర్శకుడు!

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 02:12 PM

దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ కు లీగ‌ల్ నోటీసులు పంపిస్తాన‌ని కృష్ణ అనే దర్శకుడు తెలిపాడు... త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా వచ్చిన విషయం తెలిసిందే... 2005లో త్రివిక్ర‌మ్‌ని క‌లిసి అల వైకుంఠపురములో కథ చెప్పానని, అంతేగాక.. 2013లో ఈ క‌థ‌ని ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నానని తెలిపారు.. ఈ నేపథ్యంలో త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని తాను దర్శకుడు త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని కృష్ణ అన్నారు.. త‌న క‌థ‌తో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా తీశారని ఆయన ఆరోపించారు.. దీంతో త్రివిక్రమ్‌కు నోటీసులు పంపుతానని చెప్పాడు. కాగా, ఇటీవల విడుదలైన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుని భారీ వసూళ్లను రాబడుతోంది...
Recent Post