అల్లు అర్జున్ సీక్రెట్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారంట!

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 03:54 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీక్రెట్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో బన్నీ కాస్త రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అలవైకుంఠపురంలో సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ఎవరికి చెప్పకుండా తన ఫ్యామిలీతో కలిసి ఓ మంచి స్పాట్‌కి వెళ్ళబోతున్నట్టు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వెకేషన్ పూర్తి చేసుకున్నాక ఫ్రెష్ మైండ్‌తో సుకుమార్‌తో ప్లాన్ చేసుకున్న సినిమాలో బన్నీ నటించబోతున్నాడట.
Recent Post