మార్కెట్‌ను పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్న విజయ్ !

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 04:18 PM

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న మాస్టర్ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారని వినికిడి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే విజయ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తన మార్కెట్‌ను పెంచుకోవటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’.. ఆంధ్ర, సీడెడ్ మరియు నైజాం ప్రాంతాలన్నిటిని కలుపుకుని దాదాపు రూ .10 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. దాంతో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ఇవ్వాటికి కూడా బయ్యర్స్ రెడీ అవుతున్నారు. ట్రేడ్ సర్కిల్స్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్రలో మాస్టర్ తెలుగు వెర్షన్ యొక్క థియేట్రికల్ రైట్స్ రూ .1.35 కోట్లకు మరియు నెల్లూరులో మరో రూ .48 లక్షలకు అమ్ముడయ్యాయి.
Recent Post