ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని , సుధీర్‌ బాబు సుధీర్ బాబు 'వి' టీజర్‌ డేట్ ఫిక్స్ !

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2020, 04:40 PM



ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని , సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం 'వి' . ఈ సినిమాలో అదితిరావు హైదరి, నివేదా థామస్‌ కథానాయికలుగా కనిపించనున్నారు . ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం తెలిపింది. 'వి' చిత్ర టీజర్‌ను రేపు(సోమవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని హీరో నానితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు తమ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com