మరో భారీ మల్టీస్టారర్ కు రాజమౌళి కసరత్తు!

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 06:10 PM

మరో భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ ప్రాజెక్టుకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడు. రాజమౌళి కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని వేచి చూస్తున్న వాళ్లకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌తో మల్టీస్టారర్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది. దాంతో నెక్ట్స్ ఏం చేస్తాడనేది ఇప్పట్నుంచే ఆసక్తికరంగా మారింది. అయితే మరోసారి తెలుగు సినిమా సూపర్ స్టార్స్ ఇద్దరిని కలిపి సినిమా చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దర్శకధీరుడు కూడా దీన్ని కన్ఫర్మ్ చేసాడు. ఈ చిత్రంలో ప్రభాస్ కూడా మరో హీరోగా నటిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్, మహేష్ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా త్వరగా విడుదలైపోవాలని కోరుకుంటున్నారు.
Recent Post