యాంకర్ ప్రదీప్ మూవీ నుంచి ‘ఇదేరా స్నేహం’ సాంగ్ రీలీజ్ !

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 06:31 PM

కొత్త దర్శకుడు మున్నా దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన మొదటి పాట ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్ సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సెకెండ్ సాంగ్ ‘ఇదేరా స్నేహం’ అనే పాటను మిల్క్ బ్యూటీ తమన్నా చేతుల మీదుగా రిలీజ్ అయింది. కాగా చంద్రబోస్ చక్కని సాహిత్యం సమకూర్చిన ఈ పాటను అనూప్ రూబెన్స్ ఎప్పటిలాగే మెలోడీ ట్యూన్ తో క్లాసికల్ సౌండ్స్ తో పాటను చక్కగా తీర్చి దిద్దాడు. ఇక ఈ పాటను పాడిన అర్మాన్ మాలిక్ తన వాయిస్ తో ఈ పాటకు ప్రాణం పోశారు. స్క్రీన్ మీద ఆ పాటలోని భావానికి తగ్గట్లు విజువల్స్ కూడా బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్లు ప్రదీప్, అమృత కూడా గొప్పగా అభినయించారు. మొత్తానికి ఈ పాట కూడా సినిమా పై ఆసక్తిని పెంచింది.
Recent Post