రేపు నితిన్ ‘భీష్మ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 07:24 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా  ఫిబ్రవరి 21న రిలీజ్ కానుది. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. రేపు సాయంత్రం 4 గంటల 05 నిముషాలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా రేపు ఘనంగా జరగనుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. కాగా ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం.




Recent Post