యూట్యూబ్‌లో ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌!

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 07:44 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’. అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలలో పాటు, యూఎస్ లో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆల్బమ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట ఒక సెన్సేషన్. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను సంగీత ప్రియులు కొన్ని వందలసార్లు వినుంటారు. సినిమాలో కూడా ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. కాకపోతే, పాట వచ్చే సందర్భమే ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. ఇదిలా ఉంటే, ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 4కె రిజల్యూషన్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బ్రైట్ స్క్రీన్‌లో ఈ పాటను చూస్తే అచ్చం వెండితెరపై చూసినట్టే ఉంటుంది. ఈ పాటను సీనియర్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. సిరివెన్నెల సాహిత్యం ఎంత లోతు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇంత మంచి సాహిత్యాన్ని సిద్ శ్రీరామ్ అంతే గొప్పగా ఆలపించారు. దీనికి థమన్ ఇచ్చిన ట్యూన్ ప్రాణం పోసింది. మొత్తంగా వీరు ముగ్గురూ కలిసి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటను అందించారు.
Recent Post