చిరు 152 మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ !

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 16, 2020, 08:05 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టోరీ మాత్రమే కాకుండా అభిమానుల కోసం మంచి పాటలు, డ్యాన్సులు ఉండేలా చూసుకుంటున్నారు. వీటి కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టారు. జనవరి ఆరంభంలో షూట్ మొదలుకాగా ఇప్పటికే ఒక పాట, మూడు ఫైట్స్ పూర్తికాగా నాలుగో ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.
Recent Post