కుడిపూడి విజయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఓ బహుభాషా చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించనుంది. ఇదో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. . బాబీ సింహా – వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్లను హీరోలుగా నటించాల్సిందిగా దర్శకనిర్మాతలు సంప్రదించారు. అయితే ఆ ఇద్దరి నుంచి ఇంకా అంగీకారం రాలేదట. ఈ సినిమాని తెలుగు- హిందీ – కన్నడ – తమిళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. తాజా చిత్రంలో ప్రియా పాత్ర ఎలా ఉంటుంది అంటే ఆసక్తికర సంగతులే చెప్పాడు. `ఒరు అధర్ లవ్` తో పోలిస్తే అందులో ప్రియా కాలేజీ అమ్మాయిగా నటించింది. శ్రీదేవి బంగ్లాలో పూర్తిగా పరిణతి చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. నటిగా తనని మరో స్థాయిలో చూపించే సినిమా చేస్తున్నానని విజయ్ తెలిపాడు. షూటింగ్ జూన్ లో ప్రారంభించి పూర్తిగా బ్రిటన్ లో చిత్రీకరిస్తారు.