సీబీసీఐడీకి అప్పగించిన 'ఇండియన్ 2' మూవీ యాక్సిడెంట్ కేసు!

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 01:45 PM

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' సినిమా సెట్లో  మూడు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతంలో జరిగింది. కొత్త షెడ్యూల్ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్స్‌ వేస్తున్నారు. అందులో 150 అడుగుల ఎత్తులో క్రేన్‌తో లైటింగ్‌ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా అది తెగి కిందనే ఉన్న టెంట్‌పై పడింది. ఈ ప్రమాదం లో ముగ్గురు మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో శంకర్‌ పర్సనల్‌ సెక్రటరీ మధు, సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్‌ ఉన్నారు.  భారతీయుడు 2 సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అందులో దర్శకుడు శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు ఉన్నాడు. 34 ఏళ్ల అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కూడా అక్కడే చనిపోయాడు. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసాడు. మూడు రోజుల క్రితం జరిగిన భారతీయుడు 2 యాక్సిడెంట్ కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇప్పటికే ఈ ప్రమాదంపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు శారు. నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌పై కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ చేశారు. షూటింగ్’ సందర్భంగా వినియోగించిన భారీ క్రేన్ ఆపరేటన్ రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మొత్తం 22 మంది వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్‌లకు 60 అడుగుల భారీ క్రేన్‌కు మాత్రమే అనుమతులు ఉంటాయి. కానీ, భారతీయుడు 2 కోసం 100 అడుగుల క్రేన్ వాడారు. తాను ఎంత చెప్పినా కెమెరామన్, ప్రొడక్షన్ బృందం పట్టించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Recent Post