రీమేక్ మూవీల వెంట టాలీవుడ్ పరుగులు!

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 22, 2020, 02:41 PM

టాలీవుడ్ ఇప్పుడు రీమేక్ ల వెంట పరుగులు పెడుతుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల దగ్గర వరకు ఇప్పుడు 'రీ' మేక్ ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం కొత్త కథలు దొరికటమే గగనమైపోయింది. లవ్ స్టోరీలు కూడా పాతవైపోతున్నాయి. ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయాలంటే కొత్త కథలు పుట్టుకురావాల్సిదే. అందుకే కొత్తదనంతో ఏ భాషలో సినిమాలు వచ్చినా వాటిని తమ నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు దర్శకులు. స్టార్ హీరోలు సైతం వారికే మొగ్గుచూపుతుండడంతో రీమేక్ ల రాజ్యం నడుస్తుంది.
గత కొన్ని రోజులుగా చూసుకుంటే కొన్ని రీమేక్ లు రికార్డులు కొల్లగొట్టగా... మరికొన్ని రీమేక్ లు పరవాలేదనిపించాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి, తమిళంలో కూడా మంచి విజయం సాధించిన 'పింక్' సినిమాను 'వకీల్ సాబ్' తో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్ వుంది.
తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అసురన్' సినిమాను తెలుగులో 'నారప్ప' సినిమాతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. వెంకీ ఇప్పటికే 'గురు', 'బాడీగార్డ్' సినిమాలు రీమేక్ చేసాడు. నారప్ప స్టిల్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మలయాళంలో చెప్పుకోదగ్గ సినిమాలలో ఒకటైన 'మహేశ్ఇంటే ప్రతీకారం' సినిమాను తెలుగులో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా పేరుతొ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలొ సత్యరాజ్ హీరోగా నటిస్తుండగా 'కేర్ ఆఫ్ కంచెర్లపాలెం' సినిమాను చిత్రీకరించిన వెంకటేష్ మహా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యొక్క టీజర్ ఈ రోజు విడుదలయింది.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తన కెరీర్ లోనే బెస్ట్ హిట్ అందుకున్న రామ్ కూడా ఇప్పుడు రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అరుణ్ విజయ్ 'తాడం' అనే చిత్రం తెలుగులో 'రెడ్' పేరుతొ తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాకుండా ఈ మధ్య 'జాను', 'గద్దలకొండ గణేష్', సినిమాలు కూడా రీమేక్ లుగా వచ్చాయి. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Recent Post