దర్శకుడి పరువు తీసిన కంగనా

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 03:15 PM
 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వెరీ డిఫరెంట్. చాలా ఫ్రాంక్. ఎలాంటి విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పేస్తుంది. ఇందులో బాగంగా చాలా వివాదాలు ఎదురుకుంది. అందులో దర్శకుడు కరణ్ జోహార్ వివాదం ఒకటి, గతంలో కరణ్‌ గురించి మాట్లాడుతూ..‘నువ్వు బంధుప్రీతికి పెట్టింది పేరు’ అని వ్యాఖ్యానించింది కంగనా. దాంతో కరణ్‌-కంగనల మధ్య గొడవకు దారితీసింది. ఈ విషయం కొన్ని నెలల పాటు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


తాజాగా కరణ్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ‘ఇండియాస్‌ నెక్ట్స్‌ సూపర్‌స్టార్స్‌’ కార్యక్రమానికి కంగనను ఆహ్వానించాడు. కార్యక్రమంలో భాగంగా కంగన.. కరణ్‌ గురించి మాట్లాడుతూ..‘అతను ఇంటికి వచ్చిన అతిథులకు విషం పెడతాడు’ అంది. ఆమె వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా షాకయ్యారు. కానీ కరణ్‌ మాత్రం నవ్వి వూరుకున్నాడు. నవ్వాడే కానీ మొహంలో మాత్రం సినిమాటిక్ నవ్వు కనిపించింది. దీంతో కంగనా మరోసారి కరణ్ ను టార్గెట్ చేసినట్లయింది.
Recent Post