టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో విడుదల

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 10:07 AM
 

రవితేజ- విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం టచ్ చేసి చూడు. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్లో కళ్ళ జోడు పెట్టుకొని క్లాసీ లుక్లో కనిపించాడు రవితేజ. దీంతో ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడా అనే డౌట్ అభిమానులలో కలిగింది. ఇక రీసెంట్ గా చిత్ర టీజర్ కూడా విడుదల చేశారు.ఇందులో రవితేజ చాలా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడనే అభిప్రాయం కలిగించారు. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మూవీకి సంబంధించి పుష్ప సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇది రవితేజ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.Recent Post