తైమూర్ తో కరీనా దంపతుల ఫన్ టైం

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 12:49 PM
 

బాలీవుడ్ సీనియర్ భామ కరీనా కపూర్ డిసెంబర్ 20, 2016న ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్ తైమూర్ అలీ ఖాన్ పటౌడీ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ బుడతడి ఫస్ట్ బర్త్ డే వేడుకలు హర్యానాలోని పటౌడీ ప్యాలెస్లో గ్రాండ్ గా జరిపారు కపూర్ కుటుంబ సభ్యులు. ఇక కరీనా దంపతులు తైమూర్కు బర్త్ డే గిఫ్ట్గా ఫారెస్ట్ను గిఫ్ట్ ఇచ్చారు. పటౌడి ప్యాలెస్కు దగ్గర్లోనే తైమూర్ అలీ ఖాన్ పటౌడి ఫారెస్ట్ అని పేరు పెట్టి దాన్ని తైమూర్కు బర్త్ డే గిఫ్ట్గా ఇచ్చారు. తైమూర్ బర్త్డే సెలబ్రేషన్స్ కి దాదాపు కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరు కాగా, ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను కరీనా సోదరి కరిష్మా కొద్ది రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఇక తాజాగా శశి కపూర్ తనయుడు కరణ్ కపూర్, తైమూర్ బర్త్ డే వేడుకకి సంబంధించిన మరికొన్ని ఫోటోలని ఇన్ స్ట్రాగ్రమ్ లో షేర్ చేశాడు. తనయుడితో సైఫ్, కరీనా దంపతులు ఆడుకోవడం అభిమానులకి ఎంతో ముచ్చట కలిగిస్తున్నాయి. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.
Recent Post