మోహన్‌బాబు ‘గాయత్రి’ టీజర్‌ విడుదల

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 03:27 PM
 

రామాయణంలో రాముడికి, రావణాసురుడికి మధ్య గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్లూ వాళ్లూ కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది. కానీ, వాళ్ల మూలంగా జరిగిన యుద్ధంలో అటు, ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్లు చేసింది తప్పయితే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్లు దేవుళ్లైతే ఇక్కడ నేనూ దేవుడ్నే. అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారో.. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌’ అంటున్నారు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇందులో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ లుక్‌లో, తనదైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు.

ఆర్‌.మదన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు కుమార్తెగా నిఖిల, జర్నలిస్టుగా అనసూయ కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Recent Post