విజయ్, మురగదాస్‌ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 19, 2018, 02:24 PM
 

తుపాకీ, కత్తి లాంటి ఘనవిజయాలు సాధించిన విజయ్, మురగదాస్‌ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది. మరోసారి ఓ సామాజిక సమస్య నేపథ్యంలో విజయ్ హీరోగా కమర్షియల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేశాయి. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు రావటంతో ఇళయదళపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


శుక్రవారం ఉదయం సినిమా ఓపెనింగ్ విషయంలో హింట్‌ ఇస్తూ దర్శకుడు మురుగదాస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ దీపావళి గైస్’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేసిన వెంటనే ఇది విజయ్ సినిమా ఓపెనింగ్ గురించి చేసిన ట్వీట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ విజయ్, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రారంభించాడు మురుగదాస్‌. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Recent Post