ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎందుకని అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు?....అనసూయ ఏం చెప్పింది అంటే

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 02:37 PM



ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన అనసూయకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అనసూయ బుల్లితెరపై సందడి చేస్తూనే .. తన వయసుకు తగిన పాత్రలను సినిమాల్లో చేస్తూ వస్తున్నారు. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో చాట్ చేస్తూ అనేక విషయాలను పంచుకున్నారు. "ఎందుకని అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు?" అనే ప్రశ్న ఆమెకి ఎక్కువ మంది నుంచి ఎదురైంది.


అందుకామె నవ్వుతూ .. " టైమ్ వస్తే కొన్ని అలా జరిగిపోతూ వుంటాయంతే" అన్నారు. 'రంగస్థలం'లో చరణ్ కి అత్తగా చేస్తున్నారట .. నిజమేనా?" అనే ప్రశ్నకి .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటూ సమాధానమిచ్చారు. ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నారని వార్తలు .. ఏమంటారు?" అనే ప్రశ్న .. ఆమెకి కాస్త కోపాన్ని తెప్పించింది. 'ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయండి ఇలాంటి పుకార్లు' అంటూ అసహనాన్ని ప్రదర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com