ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కెరియర్లో 'పింక్' సినిమా తొలి భారీ బడ్జెట్ చిత్రమట !

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 12:13 PM



పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేశాక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  ప్రస్తుతం 'పింక్' సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'వకీల్ సాబ్' టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, పవన్ చేయనున్న తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే దిశగా పనులను జరుపుకుంటోంది. మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో ఈ కథ నడుస్తుంది. అందువలన ఆ కాలం నాటి సెట్స్ ను భారీగా వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ ను కేటాయించాడట. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. పవన్ కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం .. ఆయన కెరియర్లో తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇదేనని అంటున్నారు. బందిపోటుగా పవన్ కనిపించనున్నాడనేది ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com