కరోనాపై ప్రియాంక పాట..కొనియాడిన డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 05:02 PM

నేను సేఫ్ హ్యాండ్స్‌ సవాలును అంగీకరిస్తున్నాను . క‌రోనా నుండి ర‌క్షించుకోవ‌డం కోసం   తీసుకోవలసిన  ప్రధాన మార్గం మీ చేతులను సరిగ్గా కడగడం  అని గ్లోబల్  స్టార్ ప్రియాంకచోప్రా  తెలిపింది . ఇలా చేస్తే మీ ప్రాణాల‌ని కాపాడుకోవ‌చ్చు అంటూ నిక్ జోనాస్‌, పరిణితీ చోప్రా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, కేట్ బాస్‌వ‌ర్త్‌, మైండీ క‌లింగ్‌ల‌కి ఈ ఛాలెంజ్‌లు విసిరింది ప్రియాంక. అయితే సేఫ్ హ్యాండ్స్ స‌వాలుని స్వీక‌రించిన  ప్రియాంక చోప్రా  పాట పాడుతూ చేతులని శుభ్ర‌ప‌ర‌చుకుంది. ఈ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, దీనిపై టెడ్రోస్ స్పందించారు. డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నామ్ .. ప్రియాంక వీడియోని షేర్‌ చేస్తూ .. మీరు ఎక్క‌డ ఉన్నా చేతుల‌ని శుభ్రంగా కడుక్కోండి. ఇది చాలా సులువైన ప‌ని. నా కోసం, మీ కోసం ఈ ప‌ని చేయండి. మీరు పాడిన హ్యాండ్ వాషింగ్ సాంగ్ చాలా న‌చ్చింది. క‌రోనా త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో మీరు మాతో భాగ‌స్వామ్యులు కావ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు.
Recent Post