టాలీవుడ్‌లో 1000 కోట్లకు పైగానే నష్టాలు..?

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 07:23 PM

కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ వైరస్ ప్రభంజనంలా విరుచుకుపడుతుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటంతో సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. నాని వి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శర్వానంద్ శ్రీకారం, ఉప్పెన, నిశ్శబ్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే వాయిదా పడ్డాయి. దాంతో ఇంకా చాలా సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిపేసారు. రోజురోజుకీ కరోనా కేసులు అధికం అవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో నెల రోజుల వరకు కూడా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంటి నుంచి కాలు కూడా బయటికి పెట్టొద్దని ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తుంది. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. 
Recent Post