ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో అమలాపాల్ కు శ్రీరెడ్డి సపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 12:17 PM



ఏఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత తన రిలేషన్ కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకిచెప్పలేదు అమలాపాల్. నటి అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఖండించింది.తాజాగా అమలాపాల్‌ రెండవ పెళ్లిపై సంచలన నటి శ్రీరెడ్డి స్పందించింది. భయపడొద్దు అమలాపాల్‌.. అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ఈ మేరకు ''బాధపడకు అమలాపాల్‌.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమలాపాల్‌ అభిమానులు మండిపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com