నేను ఏ సినిమాలో నటిస్తున్నానో నాకు తెలియడం కంటే ముందే సోషల్మీడియాలో వార్తలు రావడం ఆశ్చర్యంగా వుంది. ప్రస్తుతానికి నేను ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు. అయితే తప్పకుండా భవిష్యత్లో తమిళ సినిమా చేస్తాను’ అంటున్నారు పూజాహేగ్డే. అల వైకుంఠపురములో’ విజయంతో దక్షిణాది చిత్రసీమలో పూజాహెగ్డేకు మంచి డిమాండ్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెను కథానాయికగా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఆమెను పలు అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా తమిళంలో హీరో సూర్య సరసన ఆమె నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సూర్య, దర్శకుడు హరి కలయికలో ‘అరువా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్నది. అయితే ఈ చిత్రంలో తను నటించడం లేదని దయచేసి నా సినిమాల గురించి ముందుగా నన్ను ఓ నిర్ణయానికి రానివ్వండి అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది పూజాహేగ్డే.