ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళంలో 'ఉప్పెన'..

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 04:09 PM



మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎవరైనా మంచి సక్సస్ లోకి వస్తారు. వీళ్ళకి పెద్ద ఎసెట్ డాన్స్ అండ్ యాక్టింగ్. మెగా హీరోలందరు డాన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కారన్న సంగతి తెలిసందే. అంతేకాదు తమ ఫ్యాన్స్ ని మెప్పించడానికి ఎంతైనా శ్రమిస్తారు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందింది. తెలుగులో ఆయనకి ఇదే తొలి సినిమా. ఈ సినిమా ద్వారానే కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. నాయకా నాయికలను తెలుగు తెరకి పరిచయం చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.ఇప్పటికే తెలుగులో విడుదల కావలసిన ఈ సినిమా, లాక్  డౌన్ కారణంగా వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్ సేతుపతి, మైత్రి వారి నుంచి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట.  నిర్మాణ భాగస్వాములుగా మైత్రి వారు ఉంటారని అంటున్నారు. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, అక్కడ ఆయనే చేస్తాడని సమాచారం. ఇక నాయకా నాయికలుగా ఎవరిని తీసుకుంటారనేది త్వరలోనే తెలియనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com