ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకుమార్ ఉప్పెన మూవీకి అవసరమైన కట్స్ చెప్తున్నారట...!

cinema |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 04:50 PM



ఉప్పెన మూవీకి నిర్మాతగా ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఉప్పెన మూవీకి అవసరమైన కట్స్ చెప్తున్నారట. అలాగే మూవీ నిడివి 2:30 నిమిషాలకు తగ్గించారని వినికిడి. అలాగే మూవీ అవుట్ ఫుట్ చూసిన ఆయన సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఉప్పెన సినిమాలో ఓ కీలక రోల్ తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ థియేటర్స్ లో దిగనుంది. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సెన్సిటివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం ద్వారా వైష్ణవ్ వెండి తెరకు పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే విడుదల కావాల్సివుండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దేవిశ్రీ అందించిన సోల్ ఫుల్ ఆల్బమ్ ఇప్పటికే యూత్ ని ఆకట్టుకుంది. విడుదలకు ముంచే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com