శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోతో మూవీ చేయనున్నారట... ?

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 04:58 PM

శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. ఆ తరువాత శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోతో మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన త్వరలో వివరాలు వెల్లడిస్తాడట. కాగా ఈ చిత్రానికి నిర్మాతలుగా ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీని తెరకెక్కిస్తున్న ఏషియన్ సునీల్, నారాయణ్ దాస్ నారంగ్ ఉన్నారట. దీనిపై ఒప్పదం కూడా కుదిరిందని వినికిడి. శేఖర్ కమ్ములతో చేయనున్న ఆ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ త్వరలో విడుదల కానుంది.
Recent Post