సౌత్ ఇండియాలో నటి సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న పాపులారిటీ ప్రస్తుతం ఏ హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. అక్కినేని వారి కోడలు అయిన తరవాత సమంతకు మరింత ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సమంత తన అభిమానులను అలరిస్తున్నారు.ఇప్పుడీ భామ ఇన్ స్టాగ్రాంలో కోటి మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. దీంతో ఆనందపడిపోతూ అభిమానులకు ఈ చిన్నది థ్యాంక్స్ చెప్పింది.