ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ పుట్టిన రోజుకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్...

cinema |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 05:44 PM



చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ గురించి కొత్తగా చెప్పడానికేం ఉంది. అన్నయ్యే తనకు దేవుడు అంటాడు పవన్. తమ్ముడు కాదు వాడు నా పెద్ద కొడుకు అంటాడు చిరంజీవి. ఈ ఇద్దరూ వీలు దొరికిన ప్రతీసారి తమ ప్రేమను ప్రపంచానికి కూడా చూపిస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు అన్నయ్య పుట్టిన రోజుకు అభిమానులకు పవన్ అదిరిపోయే కానుక సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.  ఆగస్ట్ 22 వచ్చిందంటే చాలు మెగా అభిమానులకు పండగే. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజును రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా ఘనంగా జరుపుతుంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా అంత హంగామా ఉండకపోవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే కచ్చితంగా కొరటాల శివ ఆచార్య సినిమా అదే రోజు విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కుదర్లేదు.. అసలు సినిమా ఈ ఏడాది రావడం కూడా అనుమానంగానే కనిపిస్తుంది. దాంతో ఫ్యాన్స్‌కు నిరాశే అనుకున్నారంతా. అయితే ఇప్పుడు అన్నయ్య బర్త్ డేను తమ్ముడు సెలబ్రేట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.చిరంజీవి పుట్టిన రోజుకు పవర్ స్టార్ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. జూన్ మొదటి వారంలో దాన్ని కూడా పూర్తి చేసి.. జులై అంతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ముందు ఈ చిత్రాన్ని మే 15నే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా మింగేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు వకీల్ సాబ్ చిరంజీవి పుట్టిన రోజు వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ఆలోచననే దిల్ రాజు సైతం సరే అన్నాడని తెలుస్తుంది. ఆగస్ట్ 22 శనివారం అయినా కూడా అన్నయ్య పుట్టిన రోజునే తన సినిమా రావాలని పవన్ తన నిర్మాతలను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఈ సారి చిరంజీవి పుట్టిన రోజు పవర్‌ఫుల్‌గా మారబోతుందన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com