ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటి..

cinema |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 05:55 PM



కన్నడ బుల్లితెరకు వర్ధమాన నటి మెబీనా మైఖేల్ (22) నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మెబీనా..  ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆమె.. తాజా సడలింపుల నేపథ్యంలో స్వగ్రామం మెడికెరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రయాణిస్తున్న కారు దేవీహళ్లి వద్ద అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో మెబీనాతోపాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందగా, మెబీనా స్నేహితులు కోలుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యాడు.


విషయం తెలిసిన ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో హోస్ట్ అకుల్ బాలాజీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. చాలా చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మెబీనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్ చేశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com