చాలా నార్మల్ గా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ‘బిచ్చగాడు’ సినిమా సంచలన విజయం సాధించింది. నటుడు విజయ్ ఆంటోనికి ఈ సినిమాతో అమాంతం ఇమేజ్ పెరిగింది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఊహికందని వసూళ్లను కూడా సాధించింది. అమ్మ సెంటిమెంట్ సినిమా రేంజ్ ను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన 'బిచ్చగాడు' (తమిళంలో 'పిచ్చైకారన్') అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అంతవరకు సంగీత దర్శకుడిగా వున్న విజయ్ ఆంథోనీని ఈ చిత్రం హీరోగా ప్రేక్షకుల ముందు నిలిపింది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనిని విజయ్ పూర్తిచేశాడని తెలుస్తోంది.