ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మెగాస్టార్...

cinema |  Suryaa Desk  | Published : Thu, May 28, 2020, 03:34 PM



ఈ రోజు మహానటుడు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ 97వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ప్రముఖ నటుడు చిరంజీవి ఎన్టీఆర్‌కు ట్విట్టర్ వేదిగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో  నటించడం తన  అదృష్టం అన్నారు. ఆయన పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటున్నాను అంటూ భావోద్వేగ ట్వీట్ చేసారు.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.


మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, దర్శకుడు అనిల్ రావిపూడి, కోన వెంకట్, వారాహీ చలన చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి సహా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com