తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దర్శకుడు కే.రాఘవేంద్రరావులది సంచలన కాంబినేషన్. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు విజయాలు సాధించాయి. అడవి రాముడు సినిమాతో మొదలైన వీళ్ల కాంబినేషన్. మేజర్ చంద్రకాంత్ వరకు కొనసాగింది. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 12 చిత్రాలు తెరకెక్కాయి. అందులో 10 పది చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. రెండు చిత్రాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 85 శాతం విజయాలున్నాయి. మొత్తంగా టాలీవుడ్లో ఎన్టీఆర్, కే.రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.