నిజానికి వివాదానికి కేరాఫ్ అడ్రస్ వర్మ. ఆయన తీసిన ప్రతి సినిమా వెనుక వివాదం కచ్చితంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఐతే తాజాగా 'కరోనా వైరస్'పై సినిమా తీశారు ఆర్జీవీ. అన్ని సినిమాలకు ఉన్న విధంగానే దీనికీ ఓ వివాదం సృష్టించారు వర్మ. ఆయన వివాదం వెనుక పబ్లిసిటీ స్టంట్ దాగి ఉందన్న ప్రచారమూ లేకపోలేదు. మరోవైపు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' ను తెరకెక్కించారు. 'కరోనా' ట్రైలర్ కూడా విడుదలైంది. మరోవైపు ఈ ట్రైలర్ పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ప్రశంసలు కూడా కురిపించారు.ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ వర్మను ఉద్దేశించి... 'మీరు ఇంట్లో బట్టలు ఉతకరు, ఇల్లు తుడవరు, గిన్నెలు కడగరు, లాక్ డౌన్ లో ఇంట్లో ఒక పని కూడా చేయలేదు. మీ కోసం మేము ట్వీట్లు చేయము' అని అన్నారు. దీనికి సమాధానంగా వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. లాక్ డౌన్ సమయంలో హీరోలు, దర్శకులు అలాంటి పనులు చేస్తే... తాను ఓ సినిమానే తీసేశాను అని చెప్పారు.