సోషల్ మీడియా అనేది ఇప్పుడు స్టార్స్ చేతుల్లో ఉన్న ఒక ప్రధాన ఆయుధం. ఒకప్పుడు స్టార్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వాలన్న మీడియా ద్వారా వివరణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి రూమర్స్ వచ్చినా ధైర్యంగా అసలు విషయాలని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు.కథానాయిక పూజా హెగ్డే ఇన్ స్టాగ్రాం అకౌంట్ హ్యాక్ అయింది.స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరో స్టార్ హీరోయిన్ సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పూజా ఎందుకు ఇంతలా దిగజారింది. దిగజారుడు కామెంట్స్ చేసిందని అందరు అనుకునేలోపే .. పూజా మేల్కొంది. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా హ్యాక్ గురైందని గుర్తించింది. సరిచేసే బాధ్యతని ఆమె డిజిటల్ టీమ్ తీసుకుంది. తన ఇన్ స్టా ఖాతా హ్యాకైన విషయాన్ని పూజా అభిమానులని తెలిపింది. ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని, అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్ చేసుకోవద్దని సూచించింది.ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్ సరి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజ మరో ట్వీట్ చేసింది. తన డిజిటల్ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు చెప్పింది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించానని వెల్లడించింది. మొత్తానికి పూజా సమస్య తీరింది.