ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ కి సిద్దమైన అర్జీవి క్లైమాక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 12:26 PM



విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని మరోసారి రుజువయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తన సినిమాలు డిఫరెంట్ గా రిలీజ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో ఏబరు ఊహించని విధంగా సినిమా షూటింగ్స్ కూడా పూర్తి చేసి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు శృంగార తార మియా మాల్కోవాతో తెరక్కెకించిన క్లైమాక్స్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు


 క్లైమాక్స్  సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో మే 29వ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తా అని ప్రకటించిన వర్మ.. దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్' సినిమాను ఆపలేరని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ మాటను తీసి గట్టున పెట్టేసిన ఆయన బ్రేకింగ్ న్యూస్ అంటూ మరో డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించాడు.


''మియా మాల్కోవా 'క్లైమాక్స్' మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా. ఇక ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ రేపు (మే 30) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నా. గెట్ రెడీ'' అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పెట్టిన ఈ ట్వీట్‌పై ఫన్నీ మీమ్స్‌తో మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్స్.క్రియేటివిటీకి పదును పెడుతూ కరోనా పరిస్థితులను కూడా తనకు అనువుగా మార్చుకొని శృంగార తార మియా మాల్కోవాను 'క్లైమాక్స్' సినిమా ద్వారా మరోసారి రంగంలోకి దించుతున్నారు వర్మ. గతంలో కూడా ఇదే మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సారి ఎలాంటి సంచలనాలు తీసుకొస్తాడో చూద్దాం.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com