ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ ఇంట్లో సినీ ప్రముఖులు మరోసారి భేటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 01:34 PM



మెగాస్టార్  చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించనున్నారని చెబుతున్నప్పటికీ… ప్రధానంగా బాలకృష్ణ   వివాదంపైనే చర్చ జరగబోతోందని సమాచారం. సమావేశానంతరం  మీడియాతో చిరంజీవి మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ  భేటీకి తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సి.కల్యాణ్, బెనర్జీ తదితరులు హాజరయ్యారు. మరికొందరు కూడా వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగులను పునఃప్రారంభించే విషయమై మంత్రి  తలసానితో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి తనను పిలవలేదని… అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారేమోనని బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై నాగబాబు స్పందిస్తూ బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంతో… సినీ పరిశ్రమలో ఐక్యత లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com