ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆర్ఆర్ఆర్" లో రకుల్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 29, 2020, 01:40 PM



ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ   సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతోందట. దీని కోసం ఇప్పటికే కీరవాణి ఒక సాంగ్ కూడా రెడీ చేశాడట. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేయాలని  ఆర్.ఆర్.ఆర్  టీమ్  ప్లాన్ చేస్తోందట. అయితే ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ లో  ఐటమ్ భామగా ఎవరు స్టెప్పులు వేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. దీనికోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారట. ఈ ఐటమ్ సాంగ్ కి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే రకుల్ ఈ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఆర్.ఆర్.ఆర్ లో ఒక హీరో అయిన రామ్ చరణ్ అని అనుకుంటున్నారు. చరణ్ – రకుల్ ఇంతకముందు ‘ధృవ’ ‘బ్రూస్లీ’ సినిమాల్లో కలిసి యాక్ట్ చేసారు. ఈ పరిచయంతో చరణ్ ఈ సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడట. అందుకే అమ్మడు ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. ఇదే కనుక నిజమైతే స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com