తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం నుంచి వెండి తెరకు పరిచయం అయ్యారు నిహారిక కొణిదెల. మొదట్లో మెగాఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, నాగబాబు కూతురిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై మంచి అంచనాలతో వస్తున్నారు.సినిమాలు చేస్తూనే, డిజిటల్లోను రాణిస్తోంది. తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. మొదటి సినిమా ఒక మనసు' పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్','సూర్యకాంతం' పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే నిహారిక నటించిన వెబ్ సిరీస్ 'ముద్ద పప్పు ఆవకాయ' మంచి ఆదరణ పొంది నెటిజన్లకు ఆకట్టుకుంది. ఇటీవల చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నిహారిక బోయ యువతి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటుంది నిహారిక.